- Advertisement -
తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా దీపికా రెడ్డి నియామకం అయ్యారు. ఆమె రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో తెలంగాణ స్టేట్ అవార్డును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీపికా రెడ్డి అందుకున్నారు. నేషనల్ సంగీత నాటక అకాడమీ అవార్డును 2017లో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. 1965, సెప్టెంబర్ 15న జన్మించిన దీపికారెడ్డి.. నాటక రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1976లో సంగీత నాటకంలో ప్రవేశం చేసిన దీపికా…. కుచిపూడి నాట్యకారిణిగా, కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నారు. దీపాంజలి అనే పేరుతో సంగీత నాట్య కళశాలను ఏర్పాటు చేసి ఎందరో సంగీత ప్రీయులకు కుచిపూడి నాట్యం నేర్పిస్తున్నారు.
- Advertisement -