2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందిన తరువాత.. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. 2014 నుంచి బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ పాలనలో రాష్ట్రం అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు రంగాల్లోనూ సమానంగా దూసుకుపోతుంది. వ్యవసాయ రంగంలో ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇటు ఐటీ రంగంలో మోస్ట్ డెవలప్ స్టేట్స్ జాబితాలో ముందు తెలంగాణ ముందు వరుసలో ఉంది. అయితే ఎన్నికల ముందు బిఆర్‌ఎస్ సర్కార్ ను ఇరుకున పెట్టేలా ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తుండడంతో ఏది నిజం ఏది అబద్దం అని అయోమయంలో ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిపై సిఎం కేసిఆర్ ఓ జాతీయ మీడియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుజువులతో సహ బయట పెట్టారు. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి సాధించిందో లేదో తెలియాలంటే ఆ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. కాగా 2014 లో రూ. 1 లక్ష్య ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుతం రూ. 3.12 లక్షలు గా ఉంది. ఇది దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కానీ వృద్ధి రేటు. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా తలసరి ఆదాయం నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణనే నెంబర్ ఒన్ అని నివేదికలు చెబుతున్నాయి.
ఇక 2014 కంటే ముందు రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగంలో 1,100 యూనిట్లుగా ఉంటే.. ఇప్పుడు 2,200 యూనిట్లకు చేరింది. అంటే విద్యుత్ వినియోగం రెట్టింపయింది. ఇక రాష్ట్రం ఏర్పడినప్పుడు నిరుద్యోగ రేటు 14-15 శాతం కంటే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నిరుద్యోగ రేటు 5 శాతం కంటే తక్కువకు చేరింది. ఇవన్న్జి కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా గణాంకాలే అటు అధినేత కేసిఆర్ రుజువులతో సహ వివరించారు. తెలంగాణ మోడల్ అంటే ఇదని.. విమర్శలు ఎన్ని చేసిన వాస్తవాలు వాస్తవాలుగానే ఉన్నాయని కేసిఆర్ స్పష్టం చేశారు. ఇక ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని దాదాపు 90 నుంచి 100 సీట్లు బిఆర్‌ఎస్ సొంతం చేసుకుంటుందని బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ స్పష్టం చేశారు.
Also Read:Dil Raju:మంగళవారం ఆ రెండు సిమాలు గుర్తొచ్చాయి