తెలంగాణ మోడల్..అక్షర చిహ్నం

43
- Advertisement -

’’తెలంగాణ మోడల్‘’ పుస్తకం తమ ప్రభుత్వం సాధించిన విజయ పరంపరకు అక్షరచిహ్నమని కేటీఆర్ అన్నారు.ఆదివారం ప్రగతిభవన్ లోని కేటీఆర్ కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన ’’తెలంగాణ మోడల్‘’ పుస్తకాన్ని పట్టణాభివృద్ధి, ఐటి శాఖామంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన నేటి విజయమే కాదు, రేపటి విజయాలకు కూడా దిక్సూచి అని, కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్ పొందుపరిచారని చెప్పారు.

ఒక రకంగా చెప్పాలంటే విజయాలను నమోదు చేయడం అంటే చరిత్రలో తెలంగాణా ప్రభుత్వ కార్యకలాపాలను భద్రపరచడమే. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఈ విజయాలు పుస్తకరూపంలోకి రావడం వల్ల చరిత్రలో నమోదై భవిష్యత్తరాలకు పాఠాలుగా నిలుస్తాయి.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ “Today a reader, tomorrow a leader.” అంటారని గుర్తు చేశారు. మంచి పుస్తకాలు గొప్ప మార్పునకు కారణమవుతాయని చెబుతూ, ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి? ప్రజలకు ఎలా బాధ్యత వహించాలి? ఎలా జవాబుదారిగా పనిచేయాలి? ప్రజల హక్కులను ఎలా కాపాడాలి? ప్రజాసంక్షేమానికి, అభివృద్ధికి, సంపద పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ఇలాంటి అనేక విషయాలు ఈ పుస్తకంలో అంతర్లీనంగా ఉన్నాయని వివరించారు.
\
ప్రజలకు బాధ్యత వహించే, ప్రజాపక్షం వహించే ప్రభుత్వం బీఆరెస్ ప్రభుత్వం అని చెబుతూ, సరిగ్గా దశాబ్ధం క్రితం ఉమ్మడి రాష్ట్రంలో అణిచివేతలపై, అన్యాయాలపై, వివక్షలపై పోరాడి, ఒక ఉద్యమాన్నినడిపి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడం ఒక ఎత్తయితే, రాష్ట్ర పునర్నిర్మాణం మరో ఎత్తు అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వనరుల లేమి సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఒక ఉద్యమంగా బీఆరెస్ ప్రభుత్వం పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. సరిగ్గా దశాబ్ధ కాలం క్రితం ఏర్పడిన మా ప్రభుత్వం సాధించిన విజయాలన్నింటిని పూదండలా అల్లి తీసుకువచ్చిన పుస్తకం ’’తెలంగాణ మోడల్‘’ అన్నారు.

దశాబ్ధ కాలంలో బీఆరెస్ ప్రభుత్వం ఏం సాధించింది? ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏ లక్ష్యంతో పాలనాపగ్గాలు పట్టారో ఆ దిశగా ఎంత వేగంగా అడుగులు వేశారు? ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు సాధించాయి? ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు ఈ పుస్తకం జవాబులిస్తుందని చెప్పారు. ఈ జవాబుల్లో దాగి ఉన్న మరో వాస్తవమేమంటే, ప్రజలకు బాధ్యత వహించే ప్రభుత్వం, ప్రజాపక్షాన పనిచేసే ప్రభుత్వం ఫలితాలు సాధించాలంటే ఎలా పనిచేయాలన్న దిశానిర్దేశనం ఈ పుస్తకంలో కనిపిస్తుందని చెప్పారు. అందుకే ఈ పుస్తకం పేరు ’’తెలంగాణ మోడల్‘’ అని పెట్టారని వివరించారు.

Also Read:కాంగ్రెస్ ‘బీసీ’ గోల!

ఈ పదేళ్ళ తెలంగాణ ప్రస్థానం గణనీయమైన అభివృద్ధితో పాటు గత శతాబ్ధ కాలంలో జరగని ప్రగతివికాసాలను దశాబ్ధకాలంలో చేసి చూపించిందన్నారని చెప్పారు. ఆ విధంగా భారతదేశపటంలో తెలంగాణ పాలన అభివృద్ధి మోడల్ గా నిలిచిపోయిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పదేళ్ళలో చేసిన అతిపెద్ద పని జీవించే హక్కుకు ప్రాణం పోయడమని వివరించారు. ప్రజల జీవన ప్రమాణల పెంపుదలకు గత పాలకులు ఎవ్వరూ చేయలేనంతగా కృషి చేసిందని చెబుతూ ప్రజలను ఓటు బ్యాంకులుగా చూసే దశ నుంచి ప్రజలను సంపద పెంచే శక్తులుగా మలచడంలో కేసీఆర్ విజయం సాధించారని అన్నారు.

ఇప్పటికీ మన దేశం వ్యవసాయిక దేశమే అని అంటూ, వ్యవసాయిక అభివృద్ధే దేశంలోని అన్ని రంగాలకు బలమైన పునాదులు వేస్తుందని విశ్వసించిన కేసీఆర్ ఆ రంగాన్ని తీర్చిదిద్దారని వివరిస్తూ, ప్రపంచమే అబ్బురపడే కాళేశ్వరం లాంటి అతి బారీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. నీళ్ళందని భూములకు నీళ్ళందించి వ్యవసాయ రంగానికి ప్రాణం పోసి దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మార్చేశారని చెప్పారు.

తెలంగాణ సాధించుకోడానికి 14 సంవత్సరాల సుదీర్ఘకాలం పోరాడవలసి వచ్చింది. కేసీఆర్ అలుపెరుగక, మడమతిప్పక చేసిన పోరు ఫలితం ప్రత్యేక రాష్ట్రం అని చెబుతూ, ఈ ఉద్యమస్ఫూర్తి కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమాల్లోను చూపించారని అన్నారు. పదేళ్ళ కాలంలో దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రమూ సాధించలేని అద్భుత ఫలితాలు సాధించి చూపించారన్నారు. సాటిలేని ప్రజాపాలనను అందించారని అంటూ, దేశానికి తెలంగాణ ఒక నమూనాగా నిలిపారని చెప్పారు. ఈ పుస్తకంలో ఉన్న ఒక్కొక్క పేజీ బీఆర్ఎస్ పార్టీ సాధించిన ఘన విజయాలను చాటి చెబుతుందని కేటీఆర్ పేర్కొన్నారు పదేళ్లలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏం చేసిందంటే అందుకు నిలువెత్తు సంతకంగా మా ప్రభుత్వ పథకాలు ఉన్నాయని, మా పనితీరు ఉందని, ఈ పుస్తకంలోని ప్రతి పేజీ ’’తెలంగాణ మోడల్‘’ సాధించిన విజయాలకు అక్షరసాక్ష్యం పలుకుతుందని చెప్పారు. కేసీఆర్ సామర్థ్యానికి, దక్షతకు, నిబద్దతకు నిలువుటద్దం ఈ పుస్తకంలోని ప్రతి పేజీ అన్నారు.ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, నవలా రచయిత పెద్దింటి అశోక్ కుమార్, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Also Read:కుంకుడు కాయతో జుట్టు స్ట్రాంగ్ అవుతుందా?

- Advertisement -