మేడారం జాతర ఏర్పాట్ల‌పై మంత్రుల స‌మీక్ష‌

444
medaramministers
- Advertisement -

మేడారం జాతర ఏర్పాట్లపై మేడారం హరిత కాకతీయ హోటల్ లో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాధోడ్ కలిసి వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. జంపన్నవాగు వ‌ద్ద నిర్మించిన‌ స్నానఘట్టాలను, ఇత‌ర ప‌నుల‌ను మంత్రులు పరిశీలించారు. అభివృద్ది ప‌నుల పురోగ‌తి, ఏర్పాట్ల‌ను అడిగి తెలుసుకున్నారు. మేడారం జాతర ఆఫీషల్ యాప్ ను మంత్రులు ఆవిష్కరించారు.

ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని, స్నాన ఘ‌ట్టాల వ‌ద్ద త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని, ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీట వేయాలని అధికారులకు సూచించారు. పోలీసు ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క జాతర అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ 75 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అధికారులకు , మీడియా వారికి దర్శనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. కేంద్రం నుండి జాతీయ హోదా కోసం ప్రయత్నం చేసాం అన్నారు. అంతకుముందు సమ్మక్క, సారలమ్మను మంత్రులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రాజ‌య్య‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, సీత‌క్క‌, ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, జిల్లా ఇంచార్జ్ క‌లెక్టర్ వాసం వెంక‌టేశ్వ‌ర్లు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.

- Advertisement -