సిద్దిపేటలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు మంత్రులు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌లో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పరిశీలించారు.
తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో 24,000 ఎకరాల్లో నష్టం జరిగిందని, సిద్దిపేటలో ఎక్కువ నష్టం వాటిల్లిందని, రైతులను తప్పక ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడుతోంది. రానున్న మూడు రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని…. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక కోస్తా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని… తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read:సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే

