టేబుల్ టెన్నీస్ ఆడిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్..

242
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో స్థానం సంపాదించిన వి.శ్రీనివాస్‌గౌడ్‌.. ఆబ్కారీ, పర్యాటక, క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌లోనని లాల్ బహదూర్ స్టేడియంను సందర్శించారు. స్టేడియం స్థితిగతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కార్యదర్శి బుర్రా వెంకటేశం, SATS ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, SATS, M D దినకర్ బాబు పాల్గొన్నారు.

Minister Srinivas Goud

ఈ పర్యటనలో భాగంగా స్టేడియంలో క్రీడాకారుల ప్రాక్టీసును తిలకించారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. అంతేకాకుండా ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌తో టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు మంత్రి.

- Advertisement -