గొల్ల కురుమ జాతి ధర్మం వైపే నిలబడతారని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహాభారతంలో ధర్మం, న్యాయం వైపు ఉన్నందునే పాండవులు గెలిచరాని అంటారు. కానీ నిజానికి శ్రీకృష్ణుడు పాండవుల వైపున ఉండి కురుక్షేత్రం నడిపించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏ సీఎం చేయని సంక్షేమ పనులు మన సీఎం చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ గొల్ల కురుమలను అభివృద్ధి చేశారని వారిని ఆర్థికంగా నిలబెట్టారని మంత్రి అన్నారు. గొల్ల కురమలలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకంటే ఎక్కువ తెలివి తేటలు ఉంటాయని గతంలో అసెంబ్లీలో సీఎం చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
మన్నెగూడలో జరిగిన యాదవ-కురమ సభలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ… గొల్ల కురమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రె పిల్లలు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వంలో, చట్టసభల్లో గొల్ల కురమలకు భాగస్వామ్యం కల్పించారన్నారు. కర్ణాటకలో అప్పటి మంత్రి, కాంగ్రెస్ నాయకుడు రేవణ్ణ గొర్రెల స్కీమ్ గురించి తెలిసుకుని సీఎం కేసీఆర్‌ను అభినందించారని, హైదరాబాద్‌కు వచ్చి గొంగడి కప్పి, గొర్రెపిల్లను ఇచ్చి సన్మానించాడని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ నోటీసులు ఇచ్చినా రేవణ్ణ భయపడలేదని చెప్పారు.
కురుమలకు, యాదవులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణమవుతున్నాయని, రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతాయని మంత్రి చెప్పారు. గొల్ల కురమలు గొర్రెలు కొనుక్కోవడానికి ప్రభుత్వం డబ్బులు వేయిస్తే.. ఆ డబ్బులు చేతికి రావని, సీజ్ అవుతాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయన్నారు. కానీ, వచ్చే నెల ఐదో తేదీ తర్వాత ఎప్పటిలాగే మీకు నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.
హుజూరాబాద్ లో దళితబంధు పథకం ప్రవేశపెడితే ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటివరకు 24 వేల కుటుంబాలకు దళిత బంధు అమలు చేశామని ఆయన తెలిపారు. మునుగోడులో ఓట్ల కోసం పూటకోమాట మాట్లాడే జూటాగాళ్లు వస్తున్నరని, ఆ బట్టెబాజ్, జూటేబాజ్ గాళ్లకు ఓటర్లు బుద్ది చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
కేసీఆర్‌తోనే మార్పు సాధ్యం
బిజెపికీ రాపోలు రాజీనామా..
మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు షురూ..