నోరి అందరి మన్ననలు పొందిన వ్యక్తి:హరీశ్‌రావు

87
harish rao
- Advertisement -

ప్రముఖ భారతీయ వైద్యుడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్యాన్సర్‌ నిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ఆత్మకథ ది జర్నీ ఆఫ్‌ మై లైఫ్‌ బుక్‌ను రాష్ట్ర ఆర్థిక, వైద్యరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఆవిష్కరించారు. తెలుగు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గోన్న హరీశ్‌రావు బుక్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ…అందరితో కలిసి బుక్‌ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్‌ నోరి అమెరికా అధ్యక్షుడికే వైద్యం అందించారన్నారు. పేదలకు సైతం సేవలందించారని కొనియాడారు. డాక్టర్ చదివే ప్రతి వారికి నోరి ఆత్మకథ ఉత్సాహాన్ని ఇస్తుందని, బుక్‌ను ప్రతి పౌరుడు చదవాల్సిన అవసరం ఉందన్నారు.క్యాన్సర్‌ను జయించిన వారి విజయాలను బుక్‌లో పొందుపరిచారని, ఇది అందరికీ స్ఫూర్తి అని, అద్భుతమైన పుస్తకం కొనియాడారు. విజయవంతమైన వైద్యుడి జీవితంలో ఎన్ని కష్టాలు, ఎంత శ్రమ ఉంటుందని.. వాటిని అధిగమించి ఉన్నత స్థితికి ఎలా చేరారనే విషయాలు ఈ పుస్తకం చదివితే తెలుస్తుందన్నారు. ఆత్మకథ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుందన్నారు. ప్రపంచంలో క్యాన్సర్‌ చికిత్సలో వస్తున్న అధునాతన విధానాలను వివరించారన్నారు. ఎంజేఎన్‌ ఆసుపత్రికి సలహాదారుడి ఉండి.. మెరుగైన వైద్యం పేదలకు అందేలా సహకారం అందించాలని డాక్టర్‌ నోరిని హరీశ్‌రావు కోరారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రభుత్వం రూ.750కోట్లు ఖర్చు చేసిందన్నారు.

 

- Advertisement -