- Advertisement -
కేంద్రంతో వార్‌కి రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళ్లనుంది మంత్రుల బృందం. మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్, జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్ హస్తికను వెళ్లనుండగా యాసింగిలో కేంద్రం వడ్లు కొనాల్సిందేనని డిమాండ్ చేయనున్నారు.
యాసంగి సీజన్‌లో వరి కోతలు అక్కడక్కడా మొదలయ్యాయి. దీంతో ధాన్యం మార్కెట్లోకి రాకముందే కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరేంటో తేల్చుకోవాలని డిసైడ్ అయింది. మంత్రుల బృందం కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తారు.
యాసంగిలో రాష్ట్రంలో 70 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. దీంతో వడ్ల కొనుగోలు విషయంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే ఉద్యమానికి సిద్ధం కానుంది.
- Advertisement -