స్వతంత్ర వజ్రోత్సవాల వేళ హరితహారం: మంత్రి ఐకే రెడ్డి

30
ikreddy
- Advertisement -

తెలంగాణలో 8వ విడత హరితహారంలో భాగంగా స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం అరణ్యభవన్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మంత్రి…కార్యక్రమం ఏర్పాట్లపై ఆరా తీశారు. హరితహారం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. తెలంగాణలోని ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా హరితహారంను దిగ్విజయంగా పూర్తిచేయాలని, అధికారులను అదేశించారు.

- Advertisement -