అమెరికాలో.. భువనగిరి వాసి మృతి

184
Telangana man dead in America
Telangana man dead in America
- Advertisement -

అమెరికాలోని నార్త్ కరోలినాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు లోయలో పడటంతో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు భవనగిరికి చెందిన సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ పోత్నాక్‌ ప్రదీప్ గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతుడు ప్రదీప్‌ కు ఆరునెలల క్రితమే కార్తీకతో వివాహమైంది. బర్త్‌ డే వేడుకలు జరుపుకొని వస్తుండగా ప్రమాదం సంభవించింది. మృతుడు భువనగిరి మాజీ కౌన్సిలర్ మురళి కుమారుడు.

- Advertisement -