ఉప్పొంగిన కాళేశ్వర గంగ…మురిసిపోతున్న తెలంగాణ

289
kaleshwaram
- Advertisement -

గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా సిద్ధమవుతోంది. ప్రాజెక్టులో భాగంగా మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఆరో ప్యాకేజీ నందిమేడారం భూగర్భంలో నిర్మించిన మూడో పంపు సెట్ వెట్‌ రన్‌ను విజయవంతంగా ప్రారంభించారు అధికారులు. మూడో వెట్ రన్‌ కూడా సక్సెస్ కావడంతో అధికారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఇక ఇప్పటికే ఏప్రిల్ 24,25 తేదీల్లో మొదటి,రెండో మోటార్‌ వెట్‌రన్‌ను అధికారులు సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింకు-2లో భాగంగా నంది మేడారం వద్ద అండర్ టన్నెల్‌లో భారీ పంపు హౌస్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక్కడికి వచ్చిన నీటిని పక్కనే ఉపరితలంలో ఉన్న మేడారం రిజర్వాయర్‌లో ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లో ఏడు భారీమోటర్లు ఏర్పాటు చేశారు.

130 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నారు. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచియింది. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే మహత్తర కార్యంలో భాగంగా మూడో వెట్‌ రన్‌ కూడా సక్సెస్‌ కావడంతో యావత్ తెలంగాణ మురిసిపోతోంది.

- Advertisement -