- Advertisement -
తెలంగాణ లోకాయుక్తను, ఉప లోకాయుక్తను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని కమిటీ లోకాయుక్త, ఉపలోకాయుక్త పేర్లను గురువారం ఉదయం ప్రగతిభవన్ లో సమావేశమై నిర్ణయించింది. లోకాయుక్తగా జస్టిస్ సివి.రాములు, ఉప లోకాయుక్తగా జి.నిరంజన్ రావును సిఫారసు చేసింది.
కమిటీలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ, మండలీలో విపక్ష నాయకులు పాషా ఖాద్రీ, జాఫ్రీ ఉన్నారు. కమిటీ చేసిన సిఫారసులను గవర్నర్ తిమిళిసై ఆమోదించారు.
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్ గా బి. చంద్రయ్య, సభ్యులుగా ఎన్. ఆనందరావు, మొహమద్ ఇర్ఫాన్ మోయినుద్దీన్ లను నియమించింది.
- Advertisement -