రాష్ట్రంలో కొత్తగా 2,070 కరోనా కేసులు నమోదు..

30

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 2,070 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. కరోనా నుంచి 3,762 మంది బాధితులు కోలుకోగా,మరో 18 మంది మృతిచెందారు. ఇవాళ 1,38,182 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,208 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 5,89,734 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 5,57,162 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,364గా నమోదైంది. రికవరీ రేటు మరికాస్త పెరిగి 94.47 శాతానికి చేరింది.