కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సాయంత్రం 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు అన్నీ బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలు అన్నింటికి ఇది వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.
నివాస ప్రాంతం నుంచి 3కి.మి మేర ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. రాత్రి 7 గం.ల తర్వాత నిత్యావసర అనుమతులకు నిరాకరించనున్నారు. బైక్ పై ఒకరు, కారులో ఇద్దరికి మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు 8 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా సివిల్ సప్లై కమిషనర్, రవాణా శాఖా కమిషనర్, హైదరాబాద్ పోలీస్ ఐజీ, డ్రగర్ కంట్రోలర్ డైరెక్టర్, హార్టికల్చరల్ డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్, డైరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ లను సభ్యులుగా నియమించారు.