- Advertisement -
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని తెలిపారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు.
మొదటి దశ
నవంబర్ 27 నుండి నామినేషన్.. 4236 సర్పంచ్,37440 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీ 11 డిసెంబర్.
రెండో దశ
నవంబర్ 30 నుండి నామినేషన్ 4333 సర్పంచ్ స్థానాలకు 38350 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి. 14 డిసెంబర్ పోలింగ్ తేదీ
మూడో దశ
డిసెంబర్ 3 నుండి నామినేషన్ 4159 సర్పంచ్ , 36452 వార్డులకు ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 17న పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు ఉంటుందని తెలిపారు.
Also Read:బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ది ఏదీ?:దాసోజు

- Advertisement -

