స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ అప్‌డేట్..

101
mlc elections
- Advertisement -

స్థాని క సంస్థల కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమయింది. సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరగనుంది. ఐదు జిల్లాల్లోని ఆరు స్థానాలకు 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 37 పోలింగ్‌ కేంద్రాల్లో, 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును విని‌యో‌గిం‌చు‌కోనున్నారు.

స్థానిక సంస్థల కోటాలో కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానా‌నికి పోలింగ్‌ జరు‌గు‌తుం‌న్నది. పోలింగ్‌ ప్రక్రి‌యను వెబ్‌‌క్యా‌స్టింగ్‌ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. కరోనా నిబంధనల మధ్య పోలింగ్ జరగనుంది.

- Advertisement -