- Advertisement -
తెలంగాణకు తుఫాను హెచ్చరికను జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది.
హైదరాబాద్ నగరంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
Also Read:నేపాల్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం..
మరోవైపు, రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రస్తుతం 31 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.
- Advertisement -

