KTR:తెలంగాణ కోసమే కేసీఆర్ నిరంతరం కృషి…

28
- Advertisement -

తెలంగాణ ప్రజల సంక్షేమ కోసమే సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో రూ.35లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ కార్యాలయ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజన్నపేటలో మన ఊరు – మన బడి కార్యక్రమం కింద బడిలో రూ.33 లక్షల ఖర్చుతో అదనపు తరగతి గదులు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

ఇండ్లు లేని అన్ని నిరుపేద కుటుంబాలకు గృహలక్ష్మి కింద ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో రోడ్ల వెంబడి డ్రైనేజీలను నిర్మిస్తామని కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు వారం రోజుల్లో 90కుట్టు మిషన్‌లు అందజేస్తామన్నారు. రైతు భీమా తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఒక లక్ష రైతు కుటుంబాలకు రూ.5వేల కోట్లు ఆర్థిక సహాయం అందజేశామని అన్నారు.

బీడీ కార్మికులకు పెన్షన్‌లు ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని చెప్పారు. మొత్తంగా తెలంగాణలో 3400తండాలను గ్రామ పంచాయితీలు చేశామని అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క రాజన్నపేట గ్రామంలోనే రూ.20.38 కోట్లను అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేశామన్నారు. అభివృద్ది, సంక్షేమంలో తెలంగాణ దూసుకుపోతున్నదని, దేశంలోని ఆదర్శ గ్రామాల్లో సింహభాగం తెలంగాణలోనే ఉన్నాయన్నారు.

ఇవి కూడా చదవండి…

ఏపీ మంత్రులు.. చేతనైతే పోరాడండి !

Karnataka Elections:బీజేపీకి షాక్.. కోలుకోవడం కష్టమే !

కాంగ్రెస్ టార్గెట్ పెద్దదే !

- Advertisement -