- Advertisement -
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దీపావళి సందర్భంగా రాష్ట్రంలో పటాకులు కాల్చి కంటి గాయాలపాలైన వారికి ఆర్ధిక సాయం అందించారు. ఎమ్మెల్సీగా తనకు లభించే నెల వేతనం నుంచి కంటి గాయాలైన బాధితులకు ఉచిత చికిత్సకు అవసరమయ్యే మొత్తాన్ని సాయంగా ఇచ్చారు. మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ఆమె తన వంతుగా సాయం అందజేశారు.
సరోజిని దేవి ఆస్పత్రి అధికారులను కలిసిన కవిత..పండుగ సందర్భంగా టపాకాయాలు కాల్చి కంటి గాయాలపాలైన వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. తాను సాయంగా ఇవ్వదల్చుకున్న మొత్తాన్ని ఆస్పత్రి వైద్యులకు అందించారు. అంతేగాక కంటి గాయాలైన బాధితులకు సాయంగా వచ్చిన అటెండెంట్‌లకు కూడా మూడు రోజులపాటు భోజన వసతి కల్పించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
- Advertisement -