పేద విద్యార్థులకు అండగా తెలంగాణ జాగృతి…

280
telangana jagruthi
- Advertisement -

కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ జాగృతి సంస్థ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాంతం ఏదైనా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో మాజీ ఎంపీ కవిత వెనుకడుగు వేయడం లేదు. తాజాగా తెలంగాణలోని గిరిజన, దళిత, పేద విద్యార్థులు ఆన్ లైన్ లో తమ చదువును కొనసాగించేందుకు మాజీ ఎంపీ కవిత అండగా నిలిచారు.

తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులతో ఏర్పడిన విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ కు 50 కంప్యూటర్స్, 500 కుర్చీల బహుకరించారు. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ Dr. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న VLC లతో లాక్ డౌన్ సమయంలోనూ ఆటంకం లేకుండా ఎంతో మంది పేద విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు.

ఈ ఆన్ లైన్ క్లాసులకు అవసరమైన ట్యాబ్, కంప్యూటర్లు కొనలేని పేద విద్యార్థులు చదువుకు దూరం కావొద్దన్న ఉద్దేశ్యంతోనే విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ కు 50కంప్యూటర్స్, 500 కుర్చీలు అందించారు కవిత.

భవిష్యత్తులోనూ పేద విద్యార్థుల చదువు కోసం తమకు చేతనైంత సమాయం చేస్తూనే ఉంటామన్నారు కవిత.తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్ ఈ కంప్యూటర్లను విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ కు అందించారు.

- Advertisement -