ముస్లింలకు సేఫెస్ట్ ప్లేస్‌..తెలంగాణ:అసద్

257
asaduddin owaisi
- Advertisement -

సీఎం కేసీఆర్‌ పాలనపై మరోసారి ప్రశంసలు గుప్పించారు ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఓ నేషనల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అసద్..ముస్లింలకు సురక్షితమైన రాష్ట్రం తెలంగాణ అన్నారు.దేశంలో చాలా చోట్ల మత ఘర్షనలు జరిగినా… తెలంగాణలో మాత్రం శాంతి నెలకొనివుందని చెప్పారు.

సీఎం కేసీఆర్ పాలనలో గత నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్కసారి కూడా మతపరమైన గొడవలు జరుగలేదని తెలిపారు. మళ్ళీ కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు గెలిపించాలని అసదుద్దీన్ కోరారు.

టీఆర్ఎస్ పార్టీతో తమ స్నేహం కొనసాగనుందని తెలిపారు. టీఆర్ఎస్ పోటీచేస్తున్న స్థానాలపై తమ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు.

- Advertisement -