వీవీఎస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్..

392
ktr vvs laxman
- Advertisement -

ఈడెన్ గార్డెన్స్‌ టెస్టులో తాను కొట్టిన 281 రన్స్‌ ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు హైదరాబాద్ స్టయిలిష్ బ్యాట్స్‌మెన్,మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌. హైదరాబాద్ తాజ్‌కృష్ణలో 281 అండ్ బియాండ్ అనే పుస్తకాన్ని లక్ష్మణ్‌తో కలిసి ఆవిష్కరించారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన వీవీఎస్ నా కెరీర్‌లో కీలక ఘట్టాలు ఏంటంటే.. డాక్టర్‌గా కెరీర్‌ను ఎంచుకోకపోవడం, టీమిండియా ఓపెనర్ స్థానాన్ని తిరస్కరించడం, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడం కఠిన నిర్ణయాలుగా మిగిలాయని తెలిపారు.

ఓపెనర్‌గా ఆడటం కంటే మూడో స్థానంలో ఆడినప్పుడే నా బాగా రాణిస్తానని సన్నిహితులు చెప్తే.. దాని కోసం ప్రయత్నించానని తెలిపారు. సిడ్నీలో 167 రన్స్‌ చేయడం నాలో ఆత్మవిశాస్వాన్ని నింపిందని… నేను అత్యున్నత స్థాయిలో రాణించగలనన్న దైర్యం నాకు ఆ ఇన్నింగ్స్‌తో వచ్చింది అని లక్ష్మణ్ తెలిపారు.

vvs-laxman

అసలు తన క్రికెట్ కెరీర్ పేసర్‌గా ప్రారంభమైందని అండర్‌-19 స్థాయి వరకు తాను బౌలర్‌గానే కొనసాగానని వెల్లడించాడు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌, కామెంటేటర్‌ హర్ష భోగ్లే, మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, అర్షద్‌ అయూబ్‌, చాముండేశ్వరీనాథ్‌ పాల్గొన్నారు.

- Advertisement -