నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

464
Inter Exams
- Advertisement -

తెలంగాణలో ఇవాళ్టీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. మార్చి 4వ తేది నుంచి 23వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. 9లక్షల65వేల840మంది విద్యార్దులు పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1వేయి 3వందల39 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటలకు పరీక్షా ప్రారంభంకానుండగా 8.45గంటల వరకే పరీక్షా కేంద్రంలోకి విద్యార్దులు చేరుకోవాలని తెలిపారు అధికారులు.

నిమిషం ఆలస్యం అయిన పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు అధికారులు. పటిష్ట బందోబస్తు నడుమ ఇంటర్ ప్రశ్నపత్రాలను సెంటర్లకు తరలించారు. విద్యార్దులు తమ పరీక్షా సెంటర్ ను తెలుసుకునేందుకు వీలుగా సెంటర్ లొకేషన్ యాప్ లో చూసుకోవచ్చని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షా హాళ్లను సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు అధికారులు. ఈసందర్భంగా ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్దులు ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు మంత్రి.

- Advertisement -