చెట్లను నరికితే రూ. 10వేలు జరిమానా

418
harish rao
- Advertisement -

చెట్లను నరికివేస్తే రూ.10వేలు జరిమానా విధిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలోని రంగనాయక సాగర్ ను పర్యాటక కేంద్రంగా మార్చుతాం అన్నారు . సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సిద్దిపేట పట్టణంలో గొప్ప మార్పు వస్తుంది. గతంలో తాగునీరు లేక పిల్లనివ్వాలంటే భయపడేవారు కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి నీళ్లు వస్తున్నాయి.

హౌసింగ్ బోర్డు కాలనీలో సమీకృత మార్కెట్ ను నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మోడల్ రైతు బజార్,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మించాం అలాగూ సిద్ధిపేట కోమటి చెరువును అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధులు నడుచుకోక పోతే పదవులు ఊడుతాయని హెచ్చరించారు. ప్లాస్టిక్ ను నిషేధించి.. ప్లాస్టిక్ రహిత నగరంగా సిద్దిపేటను మార్చుదాం అన్నారు.

- Advertisement -