అక్టోబర్ 25 నుండి ఇంటర్ పరీక్షలు

166
inter exams
- Advertisement -

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 25 నుండి నవంబర్ 2వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

కరోనా నేపథ్యంలో సెలబస్ వంద శాతం పూర్తికాకపోవడంతో పూర్తయిన 70 శాతం నుండే ప్రశ్నలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. పరీక్ష విధానంలో ఎలాంటి మార్పు లేదని…. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒకటి, రెండు ఐసోలేషన్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అక్టోబర్ 25న సెకండ్ లాంగ్వేజ్, అక్టోబర్ 26న ఇంగ్లీషు 1, అక్టోబర్ 27న మ్యాథ్స్ 1ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్, 28న మాథ్స్, జువాలజీ, హిస్టరీ, 29న ఫిజిక్స్, ఎకనామిక్స్, 30న కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ఉంటాయని వెల్లడించింది.

- Advertisement -