శ్రీలంక బాంబు దాడి.. అన్న మృతికి ఆనందించిన చెల్లి!

314
Sri Lanka bombers
- Advertisement -

ఇటీవల శ్రీలంకలో జరిగిన బాంబు దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.బాంబు దాడికి పాల్పడ్డ ఉగ్రవాది జహ్రాన్ హషీమ్ కూడా ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.ఈస్టర్ సందర్భంగా కొలంబోలో చోటు చేసుకున్న వరుస పేలుళ్లకు సూత్రధారి జహ్రాన్ హషీమ్ అని పోలీసులు భావిస్తున్నారు.ఈ దాడుల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 250 మందికి పైగా మరణించడం తెలిసిందే.హోటల్ షాంఘ్రీలాలో ఆత్మాహుతి దాడిలో జహ్రాన్ హషీమ్ స్వయంగా పాల్గొన్నాడు.ఈ ఘటనలో జహ్రాన్ కూడా మరణించడంతో, ఆ ఘటనలో పాల్గొన్నది అతడేనా? కాదా? అని అధికారులు నిర్ధారించుకోవాలనుకున్నారు.

Sri Lanka bombers

ఈ నేపథ్యంలో ఓ సైనిక ఇంటెలిజెన్స్ అధికారి కలుమునై ప్రాంతంలో నివసిస్తున్న జహ్రాన్ సోదరి మథానియా ఇంటికి వెళ్లారు. ‘జహ్రాన్‌ మృతదేహం అంపారా ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో ఉంది. మీరు వచ్చి అతడు మీ సోదరుడో కాదో చూసుకోండి’ అని చెప్పారు. ఇందుకు మధానియా.. ‘మీరు కేవలం చనిపోయిన ఉగ్రవాదుల ఫొటోలు మాత్రమే చూపించండి. నేను వారి మృతదేహాలను చూడాలనుకోవడం లేదు.

నేను జహ్రాన్‌తో 2017లోనే తెగదెంపులు చేసుకున్నాను. తన ప్రసంగాలతో విషాన్ని చిమ్మేవాడు. ఇస్లాం పేరుతో తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. ఇతర మతాలను తప్పుబట్టాడు. జహ్రాన్‌ ఆరో తరగతిలోనే చదువు మానేశాడు. ఇస్లామిక్‌ చదువులపై దృష్టిసారించేవాడు. అతను ఖురాన్‌ చదివి మంచి మార్గంలో నడుస్తాడనుకుంటే.. ప్రజలను చంపడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడు చచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉందని మథానియా వెల్లడించింది.

- Advertisement -