- Advertisement -
రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ నెలాఖరులోపు నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు.
ఈ ఏడాది మార్చి 25వ తేదీన నిర్మల్ మున్సిపాలిటీ పదవీకాలం ముగిసినా ఇంతవరకు ఎన్నికలు నిర్వహించడంలేదని హైకోర్టును ఆశ్రయించారు రాజేందర్ అనే వ్యక్తి . రాజేందర్ వేసిన పిటిషన్ విచారిస్తూ మున్సిపాలిటీ సభ్యులు లేక, నిధులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి.
మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో పూర్తి సమాచారాన్ని కోర్టుకు తెలియజేయాలని, విచారణ ఈరోజుకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
Also Read:కావ్య థాపర్…’నేను రెడీ’!
- Advertisement -

