సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై స్పష్టత, పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది.
మన శంకర వర ప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వుల విషయంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయబడింది. ఈ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా జారీ అయ్యాయంటూ లాయర్ విజయ్ గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు నిర్ణయం ఆలస్యంగా తీసుకోవడం వల్ల ప్రేక్షకులకు, థియేటర్ యజమానులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, హోంశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, సినిమా విడుదలకు కనీసం మూడు నెలల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అకస్మాత్తుగా ధరలు పెంచడం వల్ల ప్రజల్లో అసంతృప్తి ఏర్పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
Also Read:టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదం
టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు ముందుగానే తీసుకోవడం వల్ల నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యానికి స్పష్టత వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు సినిమా పరిశ్రమకు, ప్రేక్షకులకు కీలక మార్గదర్శకంగా నిలవనుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

