వర్మకు తెలంగాణ హైకోర్టు షాక్‌..

174
rgv
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దిశ అత్యాచారం, హత్య, నిందితుల ఎన్ కౌంటర్ కథను ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని దిశ ఘటన నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలు ఇప్పటికే మనోవేదనకు గురవుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు తెలిపారు.

ఇప్పుడు ఈ సినిమా తీసి వారిని గ్రామంలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సినిమాలో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దిశ ఎన్ కౌంటర్ చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై దర్శకుడు రాంగోపాల్ వర్మను వివరణ కోరిన న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా ఈ సినిమాను ఆపాలంటూ అటు దిశ కుటుంబ సభ్యులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

దీనిపై విచారించిన హైకోర్టు..రామ్ గోపాల్ వర్మతో పాటు దీంట్లో ప్రతివాదులు తెలంగాణ ఫిల్మ్ సెన్సార్ బోర్డు, యూనియన్ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్, రామ్ గోపాల్ వర్మ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ లకు నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -