వేణుస్వామికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

7
- Advertisement -

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల నాగ చైతన్య – శోభిత ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరుగగా వీరిద్దరి పెళ్లిపై వేణు స్వామి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నాగచైతన్య – శోభిత కూడా విడాకులు తీసుకుంటారని తెలిపారు.

వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్ గా మారగా దీనిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇవ్వగా హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు వేణుస్వామి.

అయితే తాజాగా ఆ స్టేని ఎత్తివేస్తూ కమిషన్ కు పూర్తి అధికారాలున్నాయని హై కోర్ట్ తెలిపింది. అలాగే వారంలోగా వేణుస్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు న్యాయస్థానం స్పష్టం చేసింది.

Also Read:KTR: దీపావళికి రైతులు దివాళా తీయడమేనా?

- Advertisement -