హైడ్రాకు మరోసారి ఎదురుదెబ్బ

10
- Advertisement -

హైకోర్టులో హైడ్రాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని గోల్డ్‌ఫిష్ జ్రేస్తా విల్లా కాంపౌండ్ వాల్‌ను, ఈ నెల 26వ తేదీన హైడ్రా ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిందని హైకోర్టును ఆశ్రయించారు విల్లా యాజమాని.

కోర్టులో వివాదం పెండింగ్ ఉండగానే అక్రమంగా ప్రహరీ గోడ కూల్చివేశారని యజమాని తరపు న్యాయవాది వాదనలు విని, స్టేటస్ కో కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేయడం సరికాదని…ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ అధికారులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.

Also Read:మోదీకి నచ్చిన..’పెద్ది’!

- Advertisement -