తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్నాయి. నేటి నుండి మరో ఏడు జిల్లాల్లో కూడా శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి రానున్నాయని చెప్పారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సాధారణ స్థాయితో పోలిస్తే 3.3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి వెల్లడించారు ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలులు ప్రభావం చూపనున్నాయని, ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలియజేశారు.
ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read:జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయండి: బీఆర్ఎస్