అంటు వ్యాధుల నిర్మూలనే లక్ష్యం : మంత్రి హరీష్‌ రావు

67
harish
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు, వరద బాధిత ముంపు ప్రాంతాల, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, డాక్టర్లతో.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ కూడా పాల్గోన్నారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు అంటు వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తల గురించి సమీక్షంచారు.

గోదావరి పరీవాహక వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ద ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్లందరూ సెలవులు తీసుకోకుండా, తప్పనిసరిగా డ్యూటీలు నిర్వహిస్తూ.. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో పరీక్షలు నిర్వహిస్తూ, మెడిసిన్లను ప్రజలకు అందుబాటులో ఉంచి సరఫరా చేయాలన్నారు. ఈ మేరకు హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావును కొత్తగూడెం కేంద్రంగా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రమేశ్ రెడ్డి ని మంచిర్యాల కేంద్రంగా విధులు నిర్వహిస్తూ హెల్త్ క్యాంపులు తదితర ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.

- Advertisement -