రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లాఖాన్. హైదరాబాద్ లోని హజ్ భవనంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు.
కార్యక్రమంలో మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ అజయ్ మిశ్రా, తెలంగాణ హజ్‌కమిటీ సెక్రటరీ సైఫుల్లా, తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, మైనారిటీ కమిషన్ చైర్మన్ మహ్మద్ కమురుద్దీన్, టీ న్యూస్ ఉర్ధూ ఎడిటర్ ఖయ్యూమ్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. తనలాగా మొక్కలు నాటాలని మసీవుల్లాఖాన్ మరో ముగ్గురు మైనార్టీ కమిషన్ చైర్మన్ ఖమురుద్దీన్, జాఫర్ హుస్సెన్ ఎమ్మెల్యే, ఎం ప్రభాకర్ ఎమ్మెల్సీ, కార్పోరేటర్ మమతా గుప్తాలకు మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. ఇంత చక్కటి కార్యక్రామాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.