అటవీశాఖలో పోస్టుల భర్తీ: ఢిల్లీలో ఇంద్రకరణ్

477
Indrakaran reddy
- Advertisement -

అటవీ శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నాం అని తెలిపారు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్. ఢిల్లీ మహారాష్ట్ర సదన్ లో ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన అటవీశాఖ మంత్రుల సమావేశం జరుగగా తెలంగాణ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. దేశంలో పర్యావరణ పరిరక్షణ,అడవుల రక్షణ మొక్కల పెంపకం పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఇంద్రకరణ్ రెడ్డి… రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి పెద్దమొత్తంలో మొక్కలను నాటాం అని చెప్పారు. అందులో యాభై శాతానికి పైగా మొక్కలు బతికాయని…24 శాతానికి తగ్గిపోయిన అడవులను 33 శాతానికి పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక భూగర్భ జలాలు, అడవులు వృద్ధి చెందుతున్నాయని….ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు దేశంలో ఎక్కడా రాకుడదని కోరుకుంటున్నా అని చెప్పారు. తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్లాస్టిక్ వాడకం తగ్గించి జూట్, పేపర్ బాగ్స్ ను వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు.

Environment and Forests Minister A Indrakaran Reddy assured the officials of the forest department that the government will protect them.

- Advertisement -