ఉద్యోగులకు తీపి కబురు…

63
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కరువు భత్యం 2.73శాతం పెంచుతున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు హరీశ్‌రావు ప్రకటించారు.

ప్రస్తుతం ఉన్న 17.29శాతాన్ని 20.02శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఉత్తర్వుల ప్రకారం 2021జులై నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డీఏ చెల్లించనుంది. దీంతో 4.40లక్షల మంది ఉద్యోగులు, 2.88లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. జనవరి పెన్షన్‌తో కలిపి పింఛనుదారులకు ఫిబ్రవరిలో డీఏ మొత్తం జమ కానునట్టు తెలిపారు. 2021జులై నుంచి 2022డిసెంబర్ నెలఖారు వరకు డీఏ మొత్తంను త్వరలో జమకానున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది.

ఇవి కూడా చదవండి…

టీచర్ల బదిలీల షెడ్యూల్‌ ఇదే…

తెలంగాణ వంటకాలు చాలా ఘాటు…

తమలపాకుతో ఆరోగ్యం…

- Advertisement -