- Advertisement -
రేపటి నుండి రేషన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. కార్డు ఉన్న ప్రతి లబ్దిదారుడికి 12 కిలోల బియ్యం అందించనున్నారు.
ఎఫ్‌సీఐ గోదాముల నుంచి పౌరసరఫరాలశాఖ గిడ్డంగులకు బియ్యం తరలింపు పూర్తికావడంతో పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే రద్దీ పెరిగే అవకాశముండటంతో సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న రేషన్ దుకాణాలతోపాటు హైదరాబాద్ జిల్లాలోని కమ్యూనిటీ హాల్స్‌లో కూడా పంపిణీ చేపట్టనున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రెవెన్యూ సిబ్బందితోపాటు , జీహెచ్‌ఎంసీ, పోలీసుల సహాయ సహకారాలు కూడా తీసుకోనున్నారు. పౌరసరఫరాలశాఖకు చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల సేవలను వినియోగించుకోనున్నారు.
- Advertisement -