- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మయోనైజ్‌పై బ్యాన్ విధించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో సమీక్ష లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించారు.
హోటళ్లలో తనిఖీలు, నియంత్రణ కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీల పనితీరును ఆరా తీశారు మంత్రి దామోదర. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ ఎగ్స్‌తో, ఉడకబెట్టని ఎగ్స్‌తో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని మంత్రికి వివరించారు అధికారులు.
కేరళలో మయోనైజ్‌పై బ్యాన్ విధించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలోనూ బ్యాన్ విధించాలని మంత్రి దృష్టి కి తీసుకెళ్లారు అధికారులు.
Also Read:ఆకట్టుకుంటున్న రాఘవ.. ‘కాల భైరవ’
- Advertisement -