రాష్ట్రంలో మొట్ట మొదటి కల్లాన్ని ప్రారంభించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.మహబూబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని చిన్న వంగర గ్రామం లో రాష్ట్రంలోనే మొట్టమొదటి రైతు కల్లాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రసంగించారు.
రైతు కళ్ళల్లో కల్లాల వెలుగులు వెల్లివిరుస్తున్నాయి. సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో ని తెలంగాణ ప్రభుత్వం, గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు రాష్ట్రంలో లక్ష కల్లాలను మంజూరు చేసింది. రైతులు ఎవరి చెలకల్లో, పొలాలల్లో వారు కల్లాలు నిర్మించుకోవాలని, అవసరమైన నిధులు కూడా కేటాయించింది.
ఇప్పటికే పూర్తవ్వాల్సిన కల్లాలు కరోనా, పంటల సీజన్ కారణంగా ఆలస్యంగా మొదలయ్యాయి. భూ కమతాలు చిన్నవవడం వల్ల రైతులకు పండిన పంట ను ఎక్కడ పెట్టాలో తెల్వక పంట నష్టం జరిగేది. కల్లా లు లేక రైతులు తమ పంటలను రోడ్ల మీద ఆరబెట్టుకోడం, నూర్పిల్లు వంటి అన్ని కార్యకలాపాలు చేపడుతున్నారు. ఈ చర్యల వల్ల అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. పైగా అందరికీ అన్నం పెట్టే రైతన్న రోడ్ల ను కల్లా లుగా ఉపయోగించడం ఆత్మగౌరవం గా కూడా ఉండటం లేదు. రాష్ట్రంలో రైతు లను రాజులను చేయాలని సీఎం కెసిఆర్ గారు అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. సాగునీరు, 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు చేపట్టింది. రైతులను సంఘటిత పరిచేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా, రైతుల కల్లా లు, ఖచ్చితంగా రైతుల ఆత్మ గౌరవ వేదికలు కానున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ఈ కల్లాలను ఏర్పాటు కోసం నిధులు కేటాయించారు. ఈ కల్లాల ద్వారా రైతులు తమ చేను,చెలకల్లో ధాన్యం పనులు చేసుకోవచ్చు. మొట్ట మొదటి కల్లాన్ని నా పాలకుర్తి నియోజకవర్గం చిన్న వంగర గ్రామంలో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా వుంది. కల్లా ల ను రైతులు త్వరగా నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం కెసిఆర్ గారు రైతులకు అవసరమైనన్ని కల్లా లు నిర్మించుకునే అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికారులు కూడా స్వయంగా క్షేత్ర పర్యవేక్షణ చేస్తూ, కల్లా లను వేగంగా నిర్మాణం జరిగేలా చూడాలని ఆదేశిస్తున్నాను. ఇంత గొప్ప అవకాశాలు కల్పిస్తూ, రైతుల కోసం అనేక పథకాలు చేపట్టిన, వాటిని అమలు చేసే అవకాశాలు తనకు ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.