ముస్లీం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందు..

263
KCR
- Advertisement -

ఏటా పవిత్ర రంజాన్‌ నెలలో రాష్ట్ర ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందు వేడుక ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మైనార్టీల పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు. మత సామరస్యం అనేది తెలంగాణను చూసి నేర్చుకోవాలని గాంధీజీ చెప్పిన మాటలను కేసీఆర్‌ గుర్తు చేశారు. 2014లో రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలు ఉండేవని.. దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని సీఎం వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది ఉండకూడదనేది తమ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలోని 23వేల గ్రామాల్లో నల్లా ద్వారా తాగునీరు ఇవ్వబోతున్నామని చెప్పారు. జులైలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

- Advertisement -