హోంగార్డుల‌ గౌర‌వ వేత‌నం పెంపు.. ఉత్తర్వులు జారీ..

41

తెలంగాణ‌ ప్రభుత్వం హోంగార్డుల‌కు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పని చేస్తున్న హోంగార్డుల గౌర‌వ వేత‌నాన్ని ప్ర‌భుత్వం పెంచింది. హోంగార్డుల‌కు గౌర‌వ వేత‌నం 30 శాతం పెంచుతూ హోంశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. హోంగార్డుల‌కు పెరిగిన వేత‌నాలు 2021, జూన్ నుంచి అమ‌లు కానున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి హోంగార్డులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.