తెలంగాణ మీసేవ ఆపరేటర్స్‌కి గుడ్ న్యూస్…

278
mee seva
- Advertisement -

తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్‌కి గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం. కరోనా వైరస్ తో ఉపాధి లేక పోవడంతో 5000 రూపాయల రెన్యువల్ ఫీజు రద్దు చేసింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి 12 వేల రూపాయలు ఆపరేటర్స్ అకౌంట్లో జమ చేసిన ప్రభుత్వం తరువాత వెయ్యి రూపాయల చొప్పున కట్ చేసుకునే విధంగా ఒప్పందం కుదిరింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా 5300 మంది మీసేవ ఆపరేటర్స్ లబ్ది పొందనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు టీఎంవోయూ (తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్) నేతలు.

- Advertisement -