రిటైర్మెంట్ వయస్సు పెంపు…గెజిట్ నోటిఫికేషన్ విడుదల

199
trs
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం చట్టసవరణ చేయగా, తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిటైర్మెంట్ వయస్సు పెంపు ఇవాళ్టి నుంచి అనగా 30 మార్చి 2021 నుండి అమలవుతుందని ప్రభుత్వం గెజిట్‌లో పేర్కొంది.

తెలంగాణ పీఆర్సీతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ,పదవీ విరమణ వయస్సు 61ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోగా సీఎం నిర్ణయంపై ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది.

- Advertisement -