- Advertisement -
విభజన అంశాలపై రెండు రాష్ట్రాలతో జరిగిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం ముగిసింది. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 మేరకే నిర్ణయాలు ఉండాలని మరోసారి స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. విభజన చట్టం పరిధికి లోబడే వివాదాల పరిష్కారం జరగాలని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం.ఈ సమావేశానికి ఆర్థిక, విద్యుత్, పౌరసరఫరాలు, సింగరేణి అధికారులు హాజరయ్యారు.
9 వ షెడ్యూల్లో ఉన్న 32 సంస్థలపై గతంలో వినిపించిన వాదననే మళ్ళీ వినిపించింది ఏపీ. ఆస్తులు, అప్పుల పంపకంపై విభజన చట్టంలోని 51, 52, 56 సెక్షన్లకు సవరణ చేయాలని కోరింది ఏపీ.రెండు రాష్ట్రాలు చెప్పింది విన్నారు హోంశాఖ కార్యదర్శి.
- Advertisement -