జనవరి 27న… టీచర్ల బదిలీలు

26
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం టీచర్ల పదోన్నతులు బదిలీలు లైన్‌క్లీయర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఈనెల 27వ తేదీ నుంచి ప్రభుత్వ టీచర్ల బదిలీలు పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంను బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ కార్యాలయంలో కార్యదర్శి వాకటి కరుణ పాఠశాల విద్యా డైరెక్టరేట్‌ దేవసేన ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు.

పదవీ విరమణకు ఇంకా మూడేళ్లు సర్వీస్ మాత్రమే ఉన్నవారిని ఈసారి బదిలీ చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో రెండేళ్ల సర్వీస్ ఉన్నవారికి బదిలీ నుంచి మినహాయింపు ఉండేది. పదవీ విరమణ వయసును 58నుంచి61యేళ్లకు పెంచినందు వల్ల ఈ సారి మూడేళ్ల సర్వీస్‌ మిగిలి ఉన్నా బదిలీ చేయకూడదని నిర్ణయించినట్టు తెలిసింది.

మొదట గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు బదిలీలు జరుపుతారు. అతర్వాత హెచ్‌ఎం ఖాళీలను స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతి ఇచ్చి బదిలీ చేయనున్నారు. చివరిగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు ఇచ్చి స్కూల్‌ అసిస్టెంట్ ఖాళీలను బదిలీ చేయనున్నారు. గతంలో రాష్ట్రంలో 2015జులైలో బదిలీలు పదోన్నతులు చేపట్టారు. మళ్లీ 2018లో బదిలీలు చేశారు. దీనికి సంబంధించిన సమగ్ర షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు.

ఇవి కూడా చదవండి…

వెల్‌కమ్‌ ఏడబ్ల్యూఎస్:కేటీఆర్‌

మొక్కలు నాటిన డీసీపీ శిల్పవళ్లి…

కొత్త పార్లమెంట్‌ భవనం అందాలు…

- Advertisement -