రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ రైస్ మిల్లులు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు రూ.2 వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి త్వరలో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. వరి ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచ ప్రఖ్యాత జపాన్ కు చెందిన రైస్ మిల్లు కంపెనీ కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సచివాలయంలో చర్చలు నిర్వహించారు.
రైతులకు మేలు జరిగేలా మరిన్ని ప్రణాళికలు సివిల్ సప్లై చేత సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న రైస్ మిల్లులకు అనుసంధానంగా రైస్ బ్రౌన్ ఆయిల్ ఉత్పత్తి చేసే మిల్లులు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ధాన్యాన్ని బియ్యంతోపాటు నూనే లాంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారిగా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ధాన్యం ఉత్పత్తుల్లో దేశంలోనే మొదటిస్థానానికి చేరుకున్న తెలంగాణ రైతులు తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్ లో విక్రయించి లాభాలు ఆర్జించే స్థాయికి తీసుకెళ్లామన్నారు.భవిష్యత్ లో వరి ధాన్యం నుంచి తయారు చేసే పలు రకాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ మేరకు మార్కెట్ విస్తరించే బాధ్యతను కార్పొరేషన్ నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల కానుకగా రైతుల చెంతకే రైస్ మిల్లులు చేరి పంటకు మరింత గిరాకీ పెంచేలా పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.
Also Read:Modi:అమెరికాకు ప్రధాని
రోజు రోజుకు పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి నిలువల కోసం మరిన్ని గోదామ్ లను ఈ మిల్లులకు అనుసంధానంగా నిర్మిస్తామని చెప్పారు. వరి పంటను మార్కెటింగ్ చేయడం ద్వారా రైతులను ధనవంతులుగా మార్చే కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ చేపట్టనుంది. గడిచిన తొమ్మిదేళ్లుగా కష్టాలను ఎదుర్కొని అమలు చేసిన కార్యాచరణ విప్లవాత్మక ఫలితాలు అందిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
Also Read:ఉదయం లేవగానే ఇలా చేస్తే మంచిది..!