రాష్ట్రంలోని 31నియోజకవర్గాల్లో విత్తన శుద్ది యంత్రాలు నెలకొల్పినట్లు తెలిపారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానమిచ్చారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ… రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామని తెలిపారు. సబ్సిడి ద్వారా రైతులకు విత్తనాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. రైతులకు నష్టం చేసే కంపెనీలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ సీడ్ పాలసీని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటుందని చెప్పారు. విత్తన ప్రాసెసింగ్ సమార్థ్యాన్ని రెండింతలు పెంచుకున్నాం. మూడు లక్షల నలబై ఎనిమిదివేల సమర్థ్యాన్ని ఆరు లక్షల నలబైవేల క్వింటాళ్లకు విత్తనాన్ని ప్రాసెసింగ్ కెపాసిటీని పెంచుకున్నామని తెలిపారు. ప్రపంచంలోని 18 దేశాలకు తెలంగాణ నుంచి విత్తనాలకు ఎగుమతి చేస్తున్నాం. 150 ఎకరాల్లో సీడ్ పార్క్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

