అమెరికాలో ఘంటసాల ఆరాధనోత్సవాలు

488
ghantasala
- Advertisement -

సెప్టెంబర్ 21, 2019 నుండి నవంబర్ 10, 2109 దాకా 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 9వ బాలు సంగీతోత్సవాలు పేరిట అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అనేక నగరాలలో అత్యున్నత స్థాయి సినీ సంగీత కచేరీలు జరగనున్నాయి. ప్రవేశ రుసుము లేని ఈ కార్యక్రమాలకి అందరూ ఆహ్వానితులే.

ఈ సినీ సంగీత విభావరిలో ప్రధాన గాయకుడిగా హైదరాబాద్ నుంచి “అపర ఘంటసాల” తాతా బాల కామేశ్వర రావు (10వ సారి అమెరికా పర్యటన), ప్రధాన గాయని గా హ్యూస్టన్ నివాసి “గాన రత్న” శారద ఆకునూరి అన్ని నగరాలలోనూ తమ అసమాన గానకౌశలంతో అలనాటి, ఈ నాటి మాధుర్యమైన పాటలతో అలరిస్తారు. వీరిరువురూ ప్రపంచ వ్యాప్తంగా వేలాది గాన కచేరీలు చేసిన లబ్ధ ప్రతిష్టులు.

న్యూ జెర్సీ, ఆస్టిన్, అట్లాంటా, హ్యూస్టన్, డిట్రాయిట్, లాస్ ఏంజెలెస్ నగరాల పూర్ర్తి కార్యక్రమ వివరాలు ఇందుతో జత పరిచిన ప్రకటనలలొ చూడండి. ఇతర నగరాల పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.

ఘంటసాల ఆరాధనోత్సవాలు జరిగే తేదీలు, నగరాలు

సెప్టెంబర్ 21 (New Jersey); సెప్టెంబర్ 22 (Atlanta, GA); సెప్టెంబర్ 27 (Austin, TX); సెప్టెంబర్ 29 (Houston); అక్టోబర్ 5 (Detroit, MI); అక్టోబర్ 13 (Los Angeles); అక్టోబర్ 18(Tallahasse, Fl); అక్టోబర్ 19(Okala, Fl); అక్టోబర్ 20 (Weston, Fl); అక్టోబర్ 25 (New York); అక్టోబర్ 26(Chicago); అక్టోబర్ 27 (Raleigh); నవంబర్ 2 & 3 (Orlando, Fl); నవంబర్ 8: (Augusta, GA); నవంబర్ 9 (Charlotte),నవంబర్ 10 (ఇండియానా పొలిస్)

ఇంకా ఆసక్తికలవారు సెప్టెంబర్ 28: అక్టోబర్ 4, 6, 11, 12, & నవంబర్ 1, 2019 తేదీల్లో ఈవెంట్ కోసం స్పందించాలని కోరారు. కార్యక్రమం కోసం సంప్రదించవలసిన వారు: వంశీ రామరాజు (Whatsapp ఫోన్ నెంబర్: 98490 23852, ramarajuvamsee@yahoo.co.in; వంగూరి చిట్టెన్ రాజు (832 594 9054)

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంగీత విభావరి కార్యక్రమాలు వేగేశ్న ఫౌండేషన్ (హైదరాబాద్) దివ్యాంగుల సేవాశ్రమానికి విరాళాల సేకరణ నిమిత్తం జరుగుతున్నాయి. 1988 లో కొందరు అమెరికా తెలుగు వారు నెలకొల్పిన వేగేశ్న సంస్థ గత 31 సంవత్సరాలలో వేలాది బీద దివ్యాంగ బాలబాలికలని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది, ప్రస్తుతం సుమారు 500 మంది బీద, అనాధ వికలాంగ బాలబాలికలకి జీవనోపాధికి కావలసిన ఉచిత విద్య, వైద్య సదుపాయాలతో పునరావాసం కలిస్తోంది. “సేవా బ్రహ్మ” వంశీ రామరాజు ఈ సంస్థ ధర్మ కర్తగా, మేనేజింగ్ ట్రస్టీ గా ఈ 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలలో స్వయంగా పాల్గొంటారు.

- Advertisement -