జిహెచ్ఎంసీలోని 5,156 మంది శాశ్వత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తూ ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం. ఉద్యోగి, తన భర్త లేదా భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం ఆరుగురికి వైద్య బీమా పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చే ఈ బీమా సౌకర్యంలో భాగంగా ఒకొక్కరికి కనీసం మూడు లక్షల రూపాయల విలువగల వైద్య బీమాను వర్తింపచేస్తున్నారు.
అయితే జిహెచ్ఎంసిలో ఉన్న 5,156 మంది రెగ్యులర్ ఉద్యోగులకుగాను కేవలం 2,375 మంత్రమే తమ కుటుంబ, ఉద్యోగ వివరాలను అందజేశారని మిగిలిన ఉద్యోగులందరూ ఈ నెల 30వ తేదీలోగా తమ కుటుంబ సభ్యుల వివరాలను అందజేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలియజేశారు. ఇందుకుగాను ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫార్మ ద్వారా మెడికల్ హెల్త్ స్కీం వర్తింపచేసేందుకు వివరాలను వెంటనే అందించాలని కోరారు.